వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసంతృప్తి ఫలితంగానే సిఎంపై చిరంజీవి లేఖాస్త్రం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని కల్తీసారా దుర్ఘటనపై తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై లేఖాస్త్రం సంధించడం కాంగ్రెసు వర్గాల్లో కలకలం సృష్టించింది. చిరంజీవి బహిరంగంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడడానికి లేదా వినతిపత్రం సమర్పించడానికి వీలుండగా బహిరంగంగా లేఖ రాయడం, స్వపక్షంలోనే విపక్షంగా ప్రవర్తించడం చిరంజీవి వర్గంలో పేరుకుపోతున్న అసంతృప్తికి అద్దం పడుతోందని అంటున్నారు. తనకే కాకుండా తన వర్గం శాసనసభ్యులకు పదవులు దక్కకుండా ముఖ్యమంత్రి అడ్డు పడుతున్నారనే అభిప్రాయం చిరంజీవి వర్గం శాసనసభ్యుల్లో బలంగా నాటుకుపోయినట్లు చెబుతున్నారు. చిరంజీవి ఎప్పుడంటే అప్పుడు పదవులు ఇస్తామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెబుతుండగా, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సాధ్యమైనంత వరకు చిరంజీవి వర్గానికి చెందిన శాసనసభ్యులకు పదవులు ఇచ్చే విషయంలో జాప్యం చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని అంటున్నారు.

డిసెంబర్ నెలాఖరున చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరు శాసనసభ్యులను తీసుకోవడానికి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని పార్టీ అధిష్టానం సూచిస్తే దానికి ఏవేవో కారణాలు చెప్పి వాయిదా పడేలా కిరణ్ కుమార్ రెడ్డి చూశారని అంటున్నారు. అంతేకాకుండా, ప్రజారాజ్యం పార్టీ సాంకేతికంగా కాంగ్రెసులో విలీనమైన తర్వాతనే మంత్రి పదవులు ఉంటాయని ఆయన చెప్పారు. దీన్నిబట్టి ప్రజారాజ్యం పార్టీ సాంకేతికంగా విలీనం కావడమనేది ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని అంటున్నారు. దీనివల్ల చిరంజీవి వర్గానికి ఇప్పట్లో మంత్రి పదవులు దక్కవనే అభిప్రాయం బలపడిపోయిందని చెబుతున్నారు. దీంతో చిరంజీవి వర్గంలో అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. అదే చిరంజీవి లేఖ రాయడానికి దారి తీసిందని అంటున్నారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా అధిష్టానం హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలు కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి అడ్డు పడుతున్నారనే అభిప్రాయం చిరంజీవి వర్గంలో ఏర్పడిందని చెబుతున్నారు. దానికితోడు, చిరంజీవికి చెందిన కొంత మంది శాసనసభ్యులను చేరదీసి, చిరంజీవి అభిమతానికి భిన్నంగా వ్యవహరింపజేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏమైనా, చిరంజీవి కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

English summary
It is said that MLA Chiranjeevi's letter to CM Kiran kumar Reddy is a result of dissatisfaction among formers camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X