విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారంలోకి వస్తే మద్యం మేమే అమ్మిస్తాం: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: 2014 ఎన్నికల తమ మేనిఫెస్టోలో మద్యం నియంత్రణ అంశాన్ని చేర్చుతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. ఆయన కృష్ణా జిల్లాలో కల్తీసారాకు మృతి చెందిన కుటుంబాలను, ఆసుపత్రి పాలైన వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేం అధికారంలోకి వస్తే మద్యం నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం ప్రభుత్వం ద్వారానే అమ్మిస్తామని చెప్పారు. మద్యాన్ని ఎత్తి వేయమనే చెప్పవచ్చు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నియంత్రణ పాటించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సామాన్యులను మద్యానికి అలవాటు చేసి విపరీతంగా ధరలు పెంచుతోందని ఆరోపించారు. గతంలో అమలాపురంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. మైలవరం నాటు సారా మృతులు ప్రభుత్వం హత్యలే అన్నారు.

మద్యం అక్రమాలలో కేవలం టిడిపి నేతల పాత్ర మాత్రమే లేదని అన్ని పార్టీల వారు ఉన్నారన్నారు. మా పార్టీ వారు ఎవరైనా ఉంటే వారిని పక్కన పెడతామన్నారు. పద్దెనిమిది మంది మృతి చెందినా ముఖ్యమంత్రి పరామర్శకు రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పాలసీల కారణంగానే నాటుసారాకు సామాన్యులు బలవుతున్నారన్నారు. పేదల రక్తం పిండి సంక్షేమ పథకాలు అమలు చేయాలా అని ప్రశ్నించారు. కాంగ్రెసు హయాంలో బెల్టు షాపులు పెరిగాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కుటుంబాలకు తమ పార్టీ తరఫున రూ.యాభై వేల నష్టపరిహారం ప్రకటించారు. కాగా బాబు అక్కడి నుండి మైలవరం చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

కాగా మైలవరం ఘటన దురదృష్టకరమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ హైదరాబాదులో అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కమిటీ వేస్తామని చెప్పారు. ఇక నుండి అసెంబ్లీ 60 దినాలు ఉండేలా చూస్తామన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu said that they will control liquor after 2014 election if they came in to rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X