విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిథైల్ మోతాదు మించడం వల్లనే మరణాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ: కల్తీ సారాలో మిథైల్ మోతాదు ఎక్కువగా ఉండడం వల్లనే మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. నాటు సారాలో మిథైల్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు లాబొరేటరీ పరీక్షల్లో తేలింది. కాగా, కల్తీ సారా సేవించి మరణించినవారి సంఖ్య 17కు పెరిగింది. ఆ సారా కొల్లిమెర్లలో తయారైంది. కృష్ణా జిల్లా మైలవరం తండాల్లో శనివారం చోటు చేసుకున్న కల్తీ సారా విషాదానికి ఆదివారం ఉదయం నుంచి మరో ఐదుగురు మృత్యు ఒడికి చేరారు. దీంతో, కల్తీ సారా మృతుల సంఖ్య 17కు చేరింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో 12 మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 26 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు బాధ్యులని భావిస్తున్న ఓ ఆబ్కారీ సిఐ, ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు.

మిథైల్ అధిక మోతాదులో కలపడం వల్లే మరణాలు సంభవించాయని అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఇదే విషయాన్ని మంత్రి మోపిదేవి కూడా ప్రకటించారు. మృతులు తాగిన సారా శాంపిల్స్‌ను పరిశోధన కోసం గుంటూరులోని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు పంపారు. కాగా, కల్తీ సారా ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించాయి. ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసి సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

బాధిత కుటుంబాలను ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆ శాఖ కమిషనర్ సమీర్ శర్మ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి మోపిదేవి ప్రకటించారు. మట్టి ఖర్చుల కింద మరో రూ.10 వేలు ఇస్తామని, బాధిత కుటుంబాల్లో అర్హులు ఉంటే రాజీవ్ యువ కిరణాల పథకం కింద ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

English summary
Laboratory investigations proved that deaths were occurred due to the methyl content.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X