ఏపీలో కొత్త పెన్షన్ దారులకు గుడ్ న్యూస్- ఆ రోజే దరఖాస్తులు-ఇవన్నీ తప్పనిసరి..!

ఏపీలో కూటమి ప్రభుత్వం తొలిసారి కొత్త పెన్షన్ల కోసం (new pension) దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం.. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ మేరకు శుభవార్త చెప్పింది. ఈ నెలలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఏయే పెన్షన్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు, అర్హతలు ఏంటి ? ఇందుకోసం సమర్పించాల్సిన పత్రాలు ఏంటన్న వివరాలను వెల్లడించింది.

AP Rains: 48 గంటల్లో భారీ వర్షాలు- ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
AP Rains: 48 గంటల్లో భారీ వర్షాలు- ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభించబోతోంది. ఈసారి కొత్తగా ఇచ్చే పెన్షన్లలో వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ కూడా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవాలనే వారు ప్రధానంగా ఐదు రకాల పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు, ఆదాయ ధృవపత్రం, కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి.

AP Pension Scheme Opens June 12 Do You Have All the Documents Ready to Apply
Talliki Vandanam: తల్లికి వందనంపై కీలక అప్డేట్..! ఈసారి డబ్బుల జమకు ఇలా..!
Talliki Vandanam: తల్లికి వందనంపై కీలక అప్డేట్..! ఈసారి డబ్బుల జమకు ఇలా..!

వితంతు పెన్షన్లకు పైన తెలిపిన ఐదు పత్రాలతో పాటు భర్త మరణ ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరి. అలాగే ఒంటరి మహిళల పెన్షన్ కావాలంటే ఐదు ప్రధాన పత్రాలతో పాటు ప్రభుత్వం లేదా కోర్టు ద్వారా విడాకుల సర్టిఫికెట్ ఉండాలి. వృద్ధాప్య పెన్షన్ కావాలంటే ఐదు పత్రాలతో పాటు వయస్సు 60 ఏళ్లకు పైబడి ఉండాలి. వికలాంగుల పెన్షన్ కోసం ఐదు పత్రాలతో పాటు వైద్యులు ఇచ్చే సదరం సర్టిఫికెట్ కూడా సమర్పించాలి. ఈ పత్రాలతో ఈ నెల 12న సచివాలయాలకు వెళ్తే అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం క్షేత్రస్దాయిలో పరిశీలన చేసి పెన్షన్లను ఖరారు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+