తెలుగు టీవీ సీరియల్స్‌లో టాప్-10 బ్యూటీలు

తెలుగు ప్రేక్షకులకు సినిమా నటీమణులతో పాటు టీవీ సీరియల్స్ లో నటించే హీరోయిన్లపై కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు కేవలం సంప్రదాయ పాత్రలకే పరిమితమైన బుల్లితెర నటీమణులు.. ఇప్పుడు అటు నటనతో, ఇటు గ్లామర్‌తో వెండితెర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. సీరియల్స్‌తో క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోల ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న టాప్ 10 మోస్ట్ గ్లామరస్ టీవీ నటీమణుల గురించి తెలుసుకుందాం.

ప్రియాంక జైన్

బుల్లితెరపై మోస్ట్ పాపులర్ అండ్ గ్లామరస్ యాక్ట్రెస్ లలో ప్రియాంక జైన్ ఒకరు. 'మౌనరాగం', 'జానకి కలగనలేదు' వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో హోమ్లీ గా కనిపించిన ఈ బ్యూటీ, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక తన అసలు వైవిధ్యాన్ని చూపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన స్టైలిష్ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది.

Actress Top 10 Beauties in Telugu TV Serials who has huge following

తేజస్విని గౌడ

కన్నడ పిల్లే అయినప్పటికీ తెలుగు వారిని తన అందంతో మాయ చేసింది తేజస్విని గౌడ. 'కోయిలమ్మ', 'కేరాఫ్ అనసూయ' లాంటి సీరియల్స్‌తో మెప్పించిన ఈమె.. బుల్లితెర హీరో అమర్ దీప్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. క్యూట్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

తనూజ

'ముద్దమందారం', 'అగ్నిపరీక్ష' వంటి సీరియల్స్‌తో తెలుగు ఇళ్లల్లో గుర్తింపు తెచ్చుకున్న తనూజ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తన అందం, ఆట తీరుతో అదరగొట్టి రన్నరప్‌గా నిలిచింది. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో ఈమె షేర్ చేసే ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.

కావ్య శ్రీ

బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా మంది యువతకు కావ్యశ్రీ క్రష్ అని చెప్పొచ్చు. 'గోరింటాకు', 'అమ్మకు తెలియని కోయిలమ్మ' వంటి సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన కావ్యశ్రీ, అద్భుతమైన నటనతో పాటు తన గ్లామర్‌తోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

శోభా శెట్టి

'కార్తీక దీపం' సీరియల్‌లో 'మౌనిత'గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది శోభా శెట్టి. బిగ్ బాస్ షోతో మరింత మందికి చేరువైన ఈ కన్నడ బ్యూటీ, సోషల్ మీడియాలో హాట్ అండ్ గ్లామరస్ ఫొటోషూట్లతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.

అన్షు రెడ్డి

ప్రస్తుతం స్టార్ మాలో టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ద్వారా అన్షు రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పద్ధతిగా నటిస్తూనే, సోషల్ మీడియాలో మోడ్రన్ లుక్స్‌తో ఫాలోవర్లను పెంచుకుంటోంది.

మేఘన లోకేష్

'కళ్యాణ వైభోగం' వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది మేఘన లోకేష్. వెండితెర హీరోయిన్లను తలదన్నే అందం, అమాయకత్వంతో కూడిన లుక్స్‌తో ఈమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

రూప ముగ్గుల

టాప్ రేటింగ్స్ ఉన్న 'బ్రహ్మముడి' సీరియల్‌తో నటి రూప ముగ్గుల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు చూసి ఫ్యాన్స్.. "పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్" అంటూ కామెంట్లు పెడుతుంటారు.

దీప్తి మన్నే

'రాధమ్మ కూతురు', 'జగద్ధాత్రి' వంటి సస్పెన్స్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దీప్తి మన్నే. నటనతో పాటు అందంలోనూ ఈమె టాప్ లిస్ట్‌లో ఉంటుంది.

జ్యోతి పూర్వాజ్

'గుప్పెడంత మనసు' సీరియల్‌లో తల్లి పాత్రలో నటించి మెప్పించిన జ్యోతి పూర్వాజ్ వయసు ప్రస్తుతం 47 ఏళ్లు. కానీ గ్లామర్ విషయంలో ఆమె యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. హద్దులు చెరిపేస్తూ ఆమె ఇస్తున్న గ్లామరస్ పోజులు, ఫొటో షూట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. సినిమాల్లోనూ ఈమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+