పటోళ్ల కేసు చిక్కు వీడినట్లేనా?, లొంగిన ఐదుగురు

Patolla Govardhan Reddy
హైదరాబాద్/మహబూబ్ నగర్: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నిందితులు గురువారం లొంగిపోయారు. పటోళ్లను హత్య చేసింది తామేనంటూ బుధవారం ఓ టీవి ఛానల్‌కు సిడి పంపిన ఐదుగురు నిందితులు గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కొత్తురు పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. పటోళ్ల హత్య సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగినందు వల్ల ఆయనను ఆ పోలీసు స్టేషన్ తరలించే అవకాశముంది. అయితే పటోళ్లను చంపింది నయీం గ్యాంగ్ అని పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనుచరుడు ఆరోపిస్తున్నారు. లావాదేవీల్లో వచ్చిన విభేదాల కారణంగానే హత్య జరిగిందని, ఇందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటున్నాడు.

కాగా పటోళ్లను చంపింది తామేనంటూ ఐదుగురు వ్యక్తులు ఓ ఛానల్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్, ప్రశాంత్ రెడ్డి, అహ్మద్, శ్రీనివాస్, నరెందర్ అనే ఐదుగురు ఆ ఛానల్ ఎదుటకు వచ్చారు. తమను చంపుతాడనే ఉద్దేశ్యంతోనే పటోళ్లను చంపేసినట్లు చెప్పారు. పటోళ్ల అనేకమంది అమాయకులను చంపాడని, మాలో గ్రూపులు సృష్టించనందుకే హత్య చేశామన్నారు. మా డబ్బులు తింటూ మమ్మల్నే టార్గెట్ చేసుకున్నాడన్నారు. ఆయనతో ఉంటే మూడు పోలీసు స్టేషన్లు, ఆరు కేసులు తప్పవన్నారు. తాము అతనిని చంపకపోతే ఆయన చేతిలో తాను హతమయ్యే వాడిని అనిల్ చెప్పారు. పటోళ్ల నడిపించేది చీకటి సామ్రాజ్యమని, ఆయనకు తామంతా సహకరించామన్నారు. పార్టీ ముసుగులో చీకటి దందా చేశాడన్నారు. తాము ఎక్కడున్నామో తమ కుటుంబ సభ్యులకు తెలియదని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+