తెలంగాణ మంత్రుల గోడు, ఆజాద్ ఓపిక మంత్రం

తెలంగాణపై నిర్ణయానికి కాస్తా ఒపిక పట్టాలని ఆజాద్ తెలంగాణ మంత్రులతో చెప్పారు. పార్టీ అధిష్టానం ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తలమునలై ఉందని, దాంతో తెలంగాణపై దృష్టి పెట్టలేకపోతోందని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్న ప్రతిసారీ ఏదో సమస్య వచ్చి పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులతో తాను మరోసారి సమావేశవుతానని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. గురువారం ఉదయం నుంచి ఆజాద్‌తో భేటీ కోసం కాంగ్రెసు నాయకులు, మంత్రులు క్యూ కట్టారు. ప్రభుత్వం, పార్టీకి మధ్య సమన్వయం కోసం సమన్వయ కమిటీ సమావేశమవుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications