వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ క్షమాపణ చెప్పాలి, చిరును అడ్డుకుంటాం: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

harish rao
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం డిమాండ్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా తాము అడ్డుకుంటామన్నారు. ఒక్క టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడినే కాదని, చిరంజీవి అయినా, జగన్ అయినా, సిఎం అయినా ప్రశ్నిస్తామన్నారు. చంద్రబాబు జీవితమే మోసంతో కూడుకున్నదన్నారు. పిల్లనిచ్చిన మామను, తమ్ముడిని, బావమరుదులను కూడా ఆయన మోసం చేశారన్నారు. తల్లిని చివరి చూపు చూడలేదని విమర్శించారు. వెన్నుపోటు పొడిచి వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేశారన్నారు. వెన్నుపటు సామ్రాట్ బిరుదు ఆయనకు ఇవ్వాలన్నారు. తెలంగాణపై బాబు తన విధానం మార్చుకోకపోతే బావుండదని హెచ్చరించారు. బాబు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

టిఆర్ఎస్ త్యాగాల పునాదులపై ఏర్పడిందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు తమ వైఖరిని స్పష్టం చేయలేదని సాక్ష్యాత్తు చిదంబరమే చెప్పారన్నారు. రైతులను అవమానపర్చిన బాబు రైతు యాత్ర చేయడం విడ్డూరమన్నారు. ఎన్టీఆర్ మద్యాన్ని నిషేధిస్తే బాబు బార్లా తెరిచారన్నారు. ఆయన ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. హరీష్ టిటిడిపి ఫోరం నేతలపైనా విరుచుకు పడ్డారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా మోత్కుపల్లి, ఎర్రబెల్లిల వైఖరి ఉందన్నారు. మోత్కుపల్లి తేది నిర్ణయిస్తే కెసిఆర్ తన ఆస్తులు తెలంగాణ ప్రజలకు పంచుతారని, బాబు తన ఆస్తులను రాష్ట్ర ప్రజలకు పంపేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణకు కెసిఆర్ కుటుంబమే అడ్డైతే తాను, కెటిఆర్ తప్పుకుంటామని మీరు రాష్ట్రం తీసుకు వస్తారా అని సవాల్ చేశారు. సీమాంధ్ర ఫ్యాక్షనిస్టు నేతలను వరంగల్ టూర్‌కు ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. బాబు టిఆర్ఎస్‌పై చేసిన విమర్శలు టిటిడిపి నేతలకే వర్తిస్తాయన్నారు. తెలంగాణ కోసం మేం జైళ్లకెళ్లామని వారేం చేశారని ప్రశ్నించారు.

English summary
TRS MLA Harish Rao demanded to YS Jaganmohan Reddy apology for his flacard show in parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X