హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ విచారణలో విజయ సాయి రెడ్డి చెప్పింది తక్కువే

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి సిబిఐ విచారణలో చెప్పింది తక్కువేనని అంటున్నారు. ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ ఆయన నోరు విప్పలేదని చెబుతున్నారు. కస్టడీకి ముగియడంతో ఆయనను మంగళవారం సిబిఐ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనుంది. మరి కొంత కాలం ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం ఉంది. ప్రతి ప్రశ్నకూ ఒక నవ్వు నవ్వడం, 'అంతా సక్రమంగానే ఉంది' అని చెప్పడం ప్రారంభించారట. మొదటి రెండు రోజులు సాయిరెడ్డి విసిరిన పాచిక ఇదే. దీంతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అప్రమత్తమయ్యారు.

'ఫేస్ టు ఫేస్' టెక్నిక్ ప్రయోగించారు. కస్టడీలో మూడో రోజున సండూర్ పవర్‌లోకి వాన్‌పిక్ నుంచి, మాట్రిక్స్ నుంచి పెట్టుబడులు ఎలా వచ్చాయనే చెప్పాలంటూ, నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎదురుగా కూర్చోబెట్టి సాయిరెడ్డిని ప్రశ్నించారు. దీంతో సాయిరెడ్డికి నోరు తెరవక తప్పలేదు. సీబీఐ వ్యూహం ఫలించడంతో ఆ తర్వాత కూడా సాయిరెడ్డి కొన్ని రహస్యాలు బయటపెట్టిన ట్లు తెలిసింది. సండూర్‌లో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల ప్రతినిధులను సాయిరెడ్డి కస్టడీలో ఉండగా దిల్‌కుషాకు పిలిపించి వాళ్లు అందించిన రికార్డులు ముందుంచి, వారు చెప్పిన వివరాల ఆధారంగా జేడీ, ఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో సాయిరెడ్డికి నోరు తెరవక తప్పడం లేదని అంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాలతో పాటు రాంకీ, కోల్‌కతాలాంటి ప్రాంతాల నుంచి 'అడ్రస్ లేని' కంపెనీల పేర్లను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది? వాటి నుంచి పెట్టుబడులు ఎలా వచ్చాయి? జగతి ఆడిటర్ అయిన మీకు ఆ కంపెనీల గురించి తెలీదా? అని సీబీఐ ఉన్నతాధికారి ఘాటుగానే ప్రశ్నించినట్లు సమాచారం. విచారణకు సహకరించకపోతే పాలిగ్రాఫ్ టెస్ట్‌కు కోర్టు అనుమతి కోరతామని అధికారులు చెప్పడంతో సాయిరెడ్డి ఎనిమిది 'అనామక' కంపెనీల గుట్టు కొంత విప్పినట్లు తెలిసింది. విజయసాయి రెడ్డి కస్టడీలో ఉన్న ఐదు రోజుల్లో సీబీఐ అధికారులు ఒక్కోరోజు ఒక్కొక్కరిని పిలిపించి ప్రశ్నించారు. పెన్నా సిమెంట్స్, బెంగళూరుకు చెందిన బ్యాంకుల ప్రతినిధులు, మాట్రిక్స్ ప్రసాద్, రెవిన్యూ అధికారులు... ఇలా ఒక్కొక్కరిని పిలిచి వివరాలు సేకరించారు.

English summary
It is said that Jagathi publication vice chairman Vijaya sai Reddy has not revealed anything in CBI inquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X