హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహబూబ్‌నగర్ సీటుపై వైయస్ జగన్‌కు కొర్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ శాసనసభా స్థానం విషయంలో కాంగ్రసు పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే పనికి పూనుకుంది. మహబూబ్‌నగర్ సీటులో దివంగత శాసనసభ్యుడు టి. రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా అన్ని పార్టీలు చూడాలనే జగన్ ప్రతిపాదనను కాంగ్రెసు తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్దపడింది. కక్క లేక మింగలేక జగన్ తన ప్రతిపాదనకు అంగీకరించేలా చేసే ఎత్తుగడకు కాంగ్రెసు నాయకత్వం పూనుకుంది. విజయలక్ష్మిని తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేసింది.

కాంగ్రెసు టికెట్ ఇస్తే మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయడానికి విజయలక్ష్మి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె అధకారికంగా చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని ఆమె ఇతర పార్టీలను కోరుతున్నారు కూడా. నిజానికి, విజయలక్ష్మి తమ పార్టీకి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక ప్రతిపాదనను తెచ్చారు. అయితే, అది తిరగబడి కాంగ్రెసుకు అనుకూలంగా మారింది. రాజేశ్వర రెడ్డి జీవించి ఉన్నట్లు ఆయన వైయస్సార్ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కాంగ్రెసు పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

English summary
It is clear that YSR Congress president YS Jagan proposal on Mahaboobnagar seat turned opposite to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X