హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్, కోదండరామ్ 'జగన్నా'టకం: రేవంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ జగన్నాటకం ఆడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటులో సమైక్యగళం వినిపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వారిద్దరు బంతిపూల స్వాగతం చెప్పారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఏ పాసుపోర్టు, ఏ వీసాతో జగన్ తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆయన అడిగారు. జగన్‌ను అడ్డుకోకుండా కెసిఆర్, కోదండరామ్ ఏ మూలన కూర్చున్నారని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజల మనోభావాలను జగన్‌కు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. జగన్, కెసిఆర్, కోదండరామ్ కుమ్మక్కయి తమ పార్టీని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

వైయస్ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ నీళ్లు, ఉద్యోగాలు, నిధులు దోచుకున్నారని, దోచుకున్నవాటిని తిరిగి ఇస్తానని జగన్ చెప్పాడా, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తానని హామీ ఇచ్చాడా, తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇస్తానని హామీ ఇచ్చాడా అని ఆయన అన్నారు. ఏదీ చేయని జగన్‌కు తెలంగాణలో ఎందుకు స్వాగతం చెబుతున్నారని ఆయన అడిగారు. జగన్ తెలంగాణ పర్యటనకు వస్తే కోదండరామ్, కెసిఆర్, వారికి కోరస్ పాడే నాగం జనార్దన్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్ కరుడు గట్టిన సమైక్యవాది అని, అధికారంలోకి వస్తే తెలంగాణను దోచుకుంటాడని ఆయన అన్నారు.

జగన్ అవినీతి సొమ్ముకు కెసిఆర్, కోదండరామ్, నాగం జనార్దన్ రెడ్డి కక్కుర్తి పడ్డారా అని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీపై సంచలన ప్రకటనలు చేసి నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారని, జగన్‌తో నాగం జనార్దన్ రెడ్డికి రహస్య అవగాహన ఉందని తాము అప్పటి నుంచే చెబుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణలోని ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆయన చెప్పారు.

English summary
TDP Telangana region MLA Revanth Reddy lashed out KCR and Kodandaram on YS Jagan's Armoor tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X