వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ వర్సెస్ దామోదర: లీకుపై బొత్సను నిలదీసిన ఆజాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: హైదరాబాదులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జరిగిన చర్చ అంశాలు బయటకు లీక్ అయ్యాయంటూ కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను మంగళవారం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో ఎవరేం మాట్లాడారనేది బయటకు వెల్లడించవద్దని, ఆ భేటీ ప్రారంభంలోనే తాను అందరికీ చెప్పానని, అయినప్పటికీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని దామోదర రాజనర్సింహ నిలదీసిన విషయం పత్రికల్లోకి ఎలా వచ్చిందని, ఎవరు లీక్ చేశారని ప్రశ్నించారని సమాచారం. ఈ విషయంపై సోనియా గాంధీ కూడా అసంతృప్తితో ఉన్నారని, ఇలాంటి వాటి వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆజాద్ చెప్పినట్లు సమాచారం. అయితే లీక్‌లో తన ప్రమేయం ఏమాత్రం లేదని ఆజాద్‌కు వివరించారట.

కాగా బొత్స ఆజాద్‌తో గంటన్నర పైగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆజాద్, సిఎంపై వచ్చిన విమర్శలను అధిష్ఠానం దృష్టికి నేను తీసుకు వెళ్లానని, సంక్రాంతి తర్వాత సిఎం ఇక త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా చూస్తామని బొత్సకు చెప్పారని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా సంక్రాంతి తర్వాత జరుగుతుందని, చిరంజీవి వర్గం నేతలకు ఈ నెల 19న అవకాశం కల్పిస్తారని ఆజాద్ చెప్పినట్లు తెలుస్తోంది. మార్చిలోనే కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందువల్ల ఈలోపు కేంద్ర కేబినెట్‌లోకి చిరంజీవిని తీసుకునే విషయం పరిశీలిస్తామని కూడా ఆజాద్ చెప్పినట్లు సమాచారం. ఉప ఎన్నికలు ఎప్పుడు జరగాలన్న విషయమూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా, ఆజాద్‌ను తాను మర్యాదపూర్వకంగా కలిశానని, నిజానికి ఢిల్లీకి కొత్త ఇంటి కోసమే వచ్చానని బొత్స చెప్పారు.

English summary
Union Minister Ghulam Nabi Azad questioned PCC chief Botsa Satyanarayana bout leak issue in co-ordination committee meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X