వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌ది చంద్రబాబు వారసత్వం: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Amabti Rambabu
హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వారసత్వాన్ని స్వీకరించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటని, తమ పార్టీకి ఆ అవసరం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు రైతుల కోసం చేస్తున్న ఉద్యమాన్ని ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు అన్యాయం చేశానని, విద్యుత్ అందించలేకపోయానని చంద్రబాబు అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు హామీ ఇస్తే విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయని చంద్రబాబు అన్నారని, ఉచిత విద్యుత్ సాధ్యమని వైయస్ నిరూపించారని ఆయన అన్నారు. పంటలు ఎండిపోతే గానీ రైతులకు బుద్ధి రాదని 1999 ఏప్రిల్ 13న చంద్రబాబు అన్న మాట నిజం కాదా అని ఆయన అడిగారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని అడిగితే కాల్పులు జరిపిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ కోసం పోరాడుతానని అంటున్నారని ఆయన అవహేళన చేశారు. బషీర్‌బాగ్ కాల్పుల సంఘటనపై క్షమాపణ చెప్పిన తర్వాతనే చంద్రబాబు విద్యుత్ సమస్యపై ఉద్యమించాలని ఆయన అన్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తనపై తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. తనపై ఏమైనా ఆధారాలుంటే సిబిఐకి సమర్పించాలని ఆయన సూచించారు. లేనిపోని ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. నైతిక విలువలు ఉంటే తప్పుడు ఆరోపణలు చేయకూడదని ఆయన అన్నారు.

English summary
YSR Congress party spokesperson Ambati Rambabu accused that CM Kiran kumar Reddy is following TDP president N Chandrababu Naidu on power issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X