వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరకులో టెన్షన్: ఎమ్మెల్యేల శిక్షణ, మావోల కరపత్రాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: జిల్లాలోని అరకులో కొత్త ఎమ్మెల్యేల అవగాహన, శిక్షణా కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే బుధవారం విశాఖపట్నం ఏజెన్సీలో మావోయిస్టుల కలకలం రేగింది. జిల్లాలో పలుచోట్ల పోలీస్ ఇన్‌ఫార్మర్లకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన కరపత్రాలు, బ్యానర్లు కనిపించాయి. అందులో బాక్సైట్‌కు వ్యతిరేకంగా అరకులో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కూడా డిమాండ్ చేశారు. బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలని, గిరిజనుల శవాలపై జరిగే ఇలాంటి అధ్యయన యాత్రలు మాకొద్దంటూ పేర్కొన్నారు. కాగా 2009 సాధారణ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు విశాఖ గిరిజన ప్రాంతాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

బుధవారం ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి బయలు దేరి వెళ్లారు. విశాఖలో అరకు వెళ్లేందుకు రెండుసార్లు ట్రయల్ రన్ వేశారు. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో సిఎం అరకు పర్యటన రద్దయింది. మరోవైపు మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు వెలిసిన ప్రదేశం ఎమ్మెల్యేల శిక్షణా కేంద్రానికి కేవలం పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా సమాచారం. కాగా లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ శిక్షణలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆయన 2009లో మొదటిసారి కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి గెలుపొందారు. మంగళవారం తరగతులలో పాల్గొన్న చిరంజీవి ఈ రోజు కూడా పాల్గొన్నారు.

English summary
Maoist banners and pomphlets found in Vishakapatnam. They demanded in their banners for MLAs resolution on bauxite.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X