పాకిస్తాన్‌లో సంక్షోభం: గిలానీపై ఐఎస్ఐ గుర్రు

ప్రధాని ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని సైన్యం అంటోంది. ఆర్మీ మద్దతు పొందుతున్న ఐఎస్ఐ కూడా గిలానీ ప్రకటనను తప్పు పడుతోంది. పాకిస్తాన్ జనరల్స్ వచ్చే 24 గంటల్లోో అత్యవసరంగా సమావేశం కానున్నారు. దీంతో పాకిస్తాన్‌లో మరో తిరుగుబాటు తప్పదా అనే పరిస్థితిని కల్పించాయి. దానికి ముందు ప్రధాని గిలానీ రక్షణ కార్యదర్శి ఖలీల్ నయీమ్ లోఢీకి ఉద్వాసన పలికారు. అదనపు కార్యదర్శి నర్గీస్ సేథీకి బాధ్యతలు అప్పగించారు.
అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై కూడా ఆర్మీ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. జర్దారీ అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆర్మీ మండిపడుతోంది. మాజీ అధ్యక్షుడు ముషార్రప్ పాకిస్తాన్‌కు చేరుకునే లోగానే పాకిస్తాన్‌లో పరిస్థితి మారిపోయే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications