చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ హయాం అధికారులు జైళ్లకెళ్తున్నారు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చిత్తూరు: సంక్రాంతి వేడుకలకు తన స్వగ్రామం నారావారిపల్లి చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గ్రామంలో జరిగిన సభలో దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుపై ప్రశంసలు గుప్పిస్తూ, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనపై విమర్శలు చేశారు. వైయస్ హయాంలో పని చేసిన అధికారులు జైళ్లకు వెళుతుంటే తన హయాంలో పని చేసిన వారు ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఎన్టీఆర్‌ను డామినేట్ చేయడం ఎవరి తరం కాదన్నారు. ఎన్టీఆర్ టిడిపిని స్థాపించింది అధికారం కోసం కాదని, పేదల అభ్యున్నతి కోసమన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత టిడిపి, ఎన్టీఆర్‌లదేనన్నారు. తెలుగు వారి ఘనత ప్రపంచానికి తెలియజెప్పారన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న వారే రాజకీయాల్లోకి వస్తారనేది తప్పని అందుకు తాను, ఎన్టీఆర్ ఉదాహరణ అని చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునన్నారు. క్యాంపస్ నుండే తాను ప్రచారం భుజాన వేసుకున్నానన్నారు. నాకు ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రజలను నేను ఎప్పుడూ మర్చిపోనన్నారు. జిల్లా, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వకుండా పొరపాటు చేశానన్నారు.

కొందరు నేతలు పార్టీకి ద్రోహం చేస్తారేమో కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పుడూ ద్రోహం చేయరన్నారు. టిడిపిని దెబ్బతీయాలనుకునే వారు దెబ్బతింటారన్నారు. పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా కార్యకర్తల అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఘతన టిడిపిదేనన్నారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ ఉంటారన్నారు. తనకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరూ లేరని చెప్పారు. ఇంకో రెండేళ్లు ప్రతిపక్షంలో ఉంటామని, ఈ రెండేళ్లు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామని చెప్పారు. కాగా అంతకుముందు చంద్రబాబు గ్రామంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu said that no one will dominate late NTR in cinema and politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X