రేపు ఢిల్లీకి కిరణ్: చిరు వర్గానికి మంత్రి పదవులు

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. తన మంత్రి వర్గ విస్తరణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకునే విషయంపై ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతారని అంటున్నారు. అయితే, చిరంజీవి వర్గానికి చెందిన సి. రామచంద్రయ్యను, గంటా శ్రీనివాస రావును మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోవడానికి విస్తరణకు పూనుకుంటారా, తన మంత్రి వర్గంలో మరిన్ని మార్పులు చేరుస్తారా అనేది తెలియడం లేదు. ఈ నెల 19వ తేదీన ఆయన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్లు వార్తలు వచ్చాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రస్తుత మంత్రివర్గంలోని ముగ్గురికి ఉద్వాసన పలకాలని ఆలోచిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తనకు ఎప్పటికప్పుడు తలనొప్పులు కలిగిస్తున్న పి. శంకరరావును, అహ్మదుల్లాను, తోట నర్సింహాన్ని మంత్రి వర్గం నుంచి తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా జానీని, జయప్రకాష్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పైగా, రామచంద్రయ్యను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కడప జిల్లా కాంగ్రెసు నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రయ్యపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణను మళ్లీ వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారా, మొత్తం మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించడానికి పూనుకుంటారా అనేది తెలియడం లేదు. అధిష్టానం ఆదేశిస్తే, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరితో విస్తరణను పరిమితం చేయవచ్చునని కూడా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+