జగన్, విజయమ్మ కుట్రలపై కొరడా దెబ్బ: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: చంద్రబాబు నాయుడి ఆస్తుల కేసును మరో కోర్టుకు తరలించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్, వైయస్ విజయమ్మ చేస్తున్న కుట్రలపై కొరడా దెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెంపపెట్టులాంటివని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కోర్టులను నమ్మకలేక పోవడం విచారకరమని ఆయన అన్నారు.

తెలంగాణ పర్యటనల విషయంలో ఒకరిపై దాడులు చేయడం, మరొకరి పట్ల మెతక వైఖరి అవలంబించడం సిరా కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించారని, వైయస్ జగన్ పట్ల మెతక వైఖరి అవలంభించారనేది ఆయన అభిమతం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సీమాంధ్రలో పర్యటించడానికి ఏ విధమైన అభ్యంతరాలు ఉండవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కె చంద్రశేఖర రావు, కెటి రామారావు తనకు అన్నదమ్ముల వంటివారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+