మాజీ ఎమ్మెల్యేపై లిక్కర్ వ్యాపారుల దాడి!, కేసు బుక్

మద్యాన్ని ఎమ్మార్పీ ధరకే అమ్మాలను సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, మరో మంత్రి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరించారని అయినప్పటికీ వ్యాపారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారని ఈ సందర్భంగా చెంగల ఆరోపించారు. ఎమ్మార్పీకే అమ్మాలంటూ శాంతియుతంగా మేం ధర్నా చేస్తుంటే మాపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దళితుడిపై దాడి చేశారన్నారు. పాయకరావుపేటలో ఎమ్మార్పీకే అమ్ముతున్నారని నక్కపల్లిలో మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. చెంగలపై దాడి చేయబోతుండగా తాము అడ్డుపడేందుకు వెళ్లామని, ఈ సమయంలో తనను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని బాధిత కార్యకర్త తెలిపారు.












Click it and Unblock the Notifications