సంక్రాంతి సంబరాల్లో విషాదం: యువకుడి కాల్చివేత

కాగా, కృష్ణా జిల్లా బొబ్బర్లంకలో కోడి పందాల సందర్భంగా ఘర్షణ చెలరేగింది. బొంబర్లంక, రేపల్లే గ్రామాలకు చెందినవారి మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో ఐదుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఐ భీమవరంలో కోడి పందాల సందర్భంగా ఘర్షణ జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని పోలవరం గ్రామంలో కోడి పందాల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. అయితే, పోలీసులను గ్రామస్థులు నిర్బంధించారు. దీంతో ఆ గ్రామానికి అదనపు బలగాలను చేరవేస్తున్నారు.












Click it and Unblock the Notifications