హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలపై సిఐడి దర్యాప్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Hyderabad-based software companies
హైదరాబాద్: ఉద్యోగాలు ఎర చూపి మోసం చేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాదుకు చెందిన మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలపై దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేర పరిశోధన విభాగం (సిఐడి)ని ఆదేశించింది. సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేసులను సిఐడికి అప్పగించాలని నిర్ణయించినట్లు ఐటి కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. హైదరాబాదులోని మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు వార్తలు వచ్చాయి.

కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనాలను చెల్లించకుండా, నిబంధనలు బేఖాతరు చేస్తూు మూత పడుతున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. పలు ఫిర్యాదులపై దర్యాప్తును ప్రారంభించడానికి ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్యమంత్రి ఆమోదాన్ని కోరింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కంపెనీల ఉదంతాలు, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా సంస్థలను మూసేస్తున్న సంఘటనలు హైదరాబాదులో జరుగుతున్న నేపథ్యంలో ఐటి శాఖ చర్యలకు దిగుతోంది.

English summary
Andhra Pradesh government on Monday asked the Crime Investigation Department (CID) to investigate the activities of three Hyderabad-based software companies accused of duping gullible youths by promising them jobs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X