హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై రామోజీ ఈనాడు డైలీ మరో అస్త్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Eenadu Daily
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రామోజీ రావు నేతృత్వంలోని ఈనాడు దినపత్రిక మరో అస్త్రం ప్రయోగించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి పెద్ద యెత్తున నిధులను మళ్లించిన డొల్ల కంపెనీల వ్యవహారంపై శనివారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.త సాక్షి దినపత్రికలోకి 22 డొల్ల కంపెనీల నుంచి నిధులు వచ్చాయని, వాటిలో 16 కంపెనీలకు ఒకరే డైరెక్టర్ ఉన్నట్లు బయపడిందని వెల్లడించింది. వీటినే ఆదాయం పన్ను శాఖ బ్రీఫ్ కేసు కంపెనీలుగా చెబుతోందని ఆ పత్రిక రాసింది. రామచంద్ర సింగ్ అనే వ్యక్తి సారథ్యంలోనే 16 కంపెనీలు ఏర్పాటైనట్లు బయటపడిందని ఈనాడు డైలీ తెలిపింది.

ఒకే వ్యక్తి డైరెక్టరుగా ఉన్న 16 కంపెనీల్లో ఆరు తమిళనాడు కేంద్రంగా స్టాక్ ఎక్స్‌ఛేంజీలో లిస్టయిన ఈటీవీ కార్పొరేషన్‌లో ప్రమోటర్ కంపెనీలుగా ఉన్నాయని, ఈటీవీ కార్పొరేషన్ పేరుకే లిస్టెడ్ కంపెనీ అని, ఆడిటింగ్ నిబంధనలు పాటించనందుకు ఇందులో 2003 నుంచి ఎస్ఎస్ఇ, బిఎస్ఇలు ట్రేడింగ్ లావాదేవీలు ఆపేశాయని ఈనాడు దినపత్రిక రాసింది. ఈటీవీ కార్పొరేషన్‌లో డైరెక్టర్లుగా ఉన్నవారి పేర్లను కూడా ఈనాడు దినపత్రిక రాసింది. వైయస్ ప్రభుత్వం నుంచి మేళ్లు పొందిన వారి దగ్గర జరిపిన వసూళ్లను జగతిలోకి మళ్లించేందుకు కోల్‌కత్తా, ముంబై, గుజరాత్ కేంద్రాలుగా నమోదైన ఆ నెట్ వర్క్ కంపెనీలను వాడుకున్నట్లు తెలుస్తోందని ఈనాడు దిపనత్రిక అనుమానించింది.

కోల్‌కత్తా కంపెనీల నుంచి 2007లోనే జగతి పబ్లికేషన్‌లోకి నిధుల వరద ప్రారంభమైందంటూ ఎలా ఆ నిధులు ప్రవహించాయో ఈనాడు దినపత్రిక వివరించింది. ఆ కంపెనీల గుట్టును ఆదాయం పన్ను శాఖ విప్పిందని రాసింది. ఆ కంపెనీల పేర్లను కూడా ఈనాడు దినపత్రిక ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టిన కంపెనీల షేర్లు ఆయా కంపెనీల పేరిట లేవని తెలిపింది. అవి ముంబైకి చెందిన అవంత్ గ్ర్డేడ్ ఫ్యాషన్‌వేర్, షావ్రతావ్ ఇండస్ట్రీస్, ఐఎ ండ్ ఐసి ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బదిలీ అయినట్లు తెలిపింది. 22 కంపెనీల పేరిట ఉన్న షేర్లు చివరకు మూడు కంపెనీల పేరిటకు బదిలీ అయినట్లు ఈనాడు దినపత్రిక రాసింది.

English summary
Ramoji Rao's Eenadu daily once again attacked YSR Congress president YS Jagan's Jagathi publication.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X