వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు వర్గానికి తప్పు లేదు, మాకు ఇవ్వట్లేదు: రాయపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambashiva Rao
గుంటూరు: పార్టీ అధిష్టానంపై కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన విమర్శలకు ఆయన మద్దతు ప్రకటించారు. కమ్మ నాయకులను టాయ్‌లెట్ పేపర్ మాదిరిగా వాడుకుని వదిలేస్తున్నారని ఆయన అన్నారు. చిరంజీవి వర్గానికి పదవులు ఇస్తే తప్పు లేదు గానీ సీనియర్లను కూడా పట్టించుకోవాలని ఆయన అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడం లేదని, దీంతో తమ వర్గం వారు తమను తిడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణవారికి కూడా మంత్రి పదవులు ఇస్తే సమతుల్యత ఏర్పడుతుందని ఆయన అన్నారు.

పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిందనే గాదె వెంకటరెడ్డి మాటల్లో నిజం ఉందని ఆయన అన్నారు. పార్టీలోని పరిస్థితికి గాదె వెంకటరెడ్డి మాటలే నిదర్శనమని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం పని చేస్తున్న సీనయర్లను ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు. పదవుల కోసం ఎగబడుతున్నవారు పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గ పునర్య్యస్థీకరణ జరగాలని, తెలంగాణవారికి మంత్రి పదవులు ఇస్తే సమతుల్యత ఏర్పడుతుందని ఆయన అన్నారు. తమకు పదవులు అవసరం లేదని, ఇచ్చినా తీసుకోబోమని ఆయన అన్నారు. ముప్పయి ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నామని, అయినా గుర్తించడం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. మంత్రి వర్గ విస్తరణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి అనుకూలమైనవారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుండేదని తమ భావన అని ఆయన అన్నారు. పదవులు లేకుండా ఎలా సేవలందిస్తారని ప్రజలు తమను అడుగుతున్నారని ఆయన అన్నారు.

English summary
Congress MP Rayapati Samabasiva Rao has expressed dissatisfaction over party high command attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X