వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాదే సరిగా లేరు, పీఆర్పీకెందుకు: హర్షకుమార్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌పై అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిరంజీవి పిఆర్పీ వర్గానికి చెందిన వారిలో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. పిఆర్పీకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమేమిటని, ఆ పార్టీకి పెద్ద పీట వేయటం వల్లే దళితులు పార్టీకి దూరమయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి ఆజాదే కారణమన్నారు. ఇందుకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. అసలు ఆజాదే సరిగా లేరని ధ్వజమెత్తారు. ఆయనది బాధ్యతారాహిత్యమన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చిన మాల వర్గానికి కేబినెట్లో ప్రాధాన్యం లేదన్నారు.

ఏ వర్గం కాంగ్రెసుకు ఓటు వేసిందో అదే వర్గాన్ని కాంగ్రెసు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. శంకర రావును బర్తరఫ్ చేసిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎందుకు తీసుకోలేదన్నారు. సమన్వయ కమిటీలోనూ సమతుల్యత లేదన్నారు. అందరినీ కలుపుకుపోయే విధంగా అధిష్టానం ఉండాలన్నారు. ఆజాద్ తీరును ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళతానన్నారు. ఓక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలన్నారు.

English summary
MP Harsha Kumar fired at Ghulam Nabi Azad about priority to Chiranjeevi camp mlas. He accused that Congress neglecting mala community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X