బాలయ్య మరో వైపు క్రిమినల్: చిరు వర్గ ఎమ్మెల్యేలు

చిరంజీవిపై పోటీ చేయడానికి ముందు బాలకృష్ణ ఉప ఎన్నికల్లో శానససభకు పోటీ చేసి గెలవాలని వారు సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే నాయకుడిగా బాలకృష్ణను తాము అంగీకరిస్తామని, ఓడిపోతే బాలకృష్ణ శ్రీరామరాజ్యం వంటి సినిమాలు తీస్తూ రామభజన చేసుకోవాలని వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నీడ కింద ఎవరూ ఎదగలేరని, ఈ విషయాన్ని బాలకృష్ణ గ్రహించాలని వారన్నారు.
కాగా, బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతిపై తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమవతి విరుచుకుపడ్డారు. లక్ష్మీపార్వతి నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు బాలయ్య రాజకీయాల్లోకి వస్తుంటే లక్ష్మీపార్వతి అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ప్రతిష్టను లక్ష్మీపార్వతి పెట్టుబడిగా పెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో లక్ష్మీపార్వతి వ్యాపారం చేస్తోందని తెలుగు మహిళ నాయకురాలు శోభారాణి అన్నారు. లక్ష్మీపార్వతిని ఆమె వైయస్సార్ కాంగ్రెసు జీతగత్తెగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications