మాజీమంత్రి రాజలింగం కన్నుమూత, సిఎం సంతాపం

ఇటీవల డిసెంబర్ 28న కాంగ్రెసు ఆవిర్భావ వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనను ఘనంగా సత్కరించారు. రాజలింగం మృతికి సిఎం, పిసిసి చీఫ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రాజలింగం 1919లో వరంగల్ జిల్లాలో జన్మించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావు మంత్రివర్గంలో పని చేశారు. 1964లో న్యాయవాద వృత్తి స్వీకరించారు.












Click it and Unblock the Notifications