రాజ్యసభ సీటు రేసులో రేణుకా చౌదరి, చిరు ఖాయం

Renuka Chowdary
హైదరాబాద్: ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి రాజ్యసభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదు వచ్చిన రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఆమె ఆదివారంనాడు తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు దాసరి నారాయణ రావు, కె. కేశవరావు, జి. సంజీవ రెడ్డి పదవీ కాలం ముగుస్తోంది. దీంతో ఆ సీట్ల కోసం కాంగ్రెసులో పలువురు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో రేణుకా చౌదరి ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికల నేపథ్యంలో రషీద్ అల్వీని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నాయి.

మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని రాజ్యసభకు నామినేట్ చేస్తారు. మిగతా సీట్ల కోసం రేణుకా చౌదరితో పాటు శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పిసిసి మాజీ అధ్యక్షుడు పి. నర్సా రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. చిరంజీవిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుండడంతో ఆయన రాజ్యసభ సీటుపై ఏ విధమైన సందేహం లేదని చెబుతున్నారు.

చిరంజీవి రాష్ట్రం నుంచి ఏడో కేంద్ర మంత్రి అవుతారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ప్రస్తుతం ఎస్ జైపాల్ రెడ్డి, వి. కిశోర్ చంద్రదేవ్, జైరాం రమేష్, దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంఎం పళ్లం రాజు, పనబాక లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే విషయంపై సందేహాలు అవసరం లేదని మంత్రి గంటా శ్రీనివాస రావు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+