ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం: వ్యాఖ్యల వేడి

మరోవైపు తూర్పూ గోదావరి జిల్లాలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలను ఆదివారం ఆర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు గ్రామాల్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో దళిత సంఘాలు ఆందోళన చేశాయి. అంబేడ్కర్ విగ్రహాలపై దాడి శోచనీయమన్నారు. కాగా అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ ఆదివారం హైదరాబాదులో కాంగ్రెసులో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు ఇవ్వడంతో దళితులు పార్టీకి దూరమయ్యే అవకాశముందని, పిఆర్పీకి అంత ప్రాధాన్యత ఇవ్వడమేమిటని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆ కోణంలో దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications