వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఠంపై కన్ను!: సిఎం కిరణ్ వర్సెస్ డిప్యూటీ దామోదర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Damodar Rajanarasimha
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కిరణ్ అండతోనే దామోదర డిప్యూటి అయ్యారు. ఐతే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపినట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. తాజాగా దామోదర కూడా ఆ పదవిపై కన్నేసినట్లుగా కనిపిస్తోంది. ఐతే ఈయన మాత్రం అందుకోసం సైలెంట్‌గా పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన సమక్షంలోనే దామోదర సిఎంపై విరుచుకు పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. కిరణ్ దళిత వ్యతిరేక విధానాల వలన కాంగ్రెసుకు దళితులు దూరమవుతున్నారని ఆయన ఆజాద్‌కు ఫిర్యాదు చేశారట. శంకర రావును తొలగించినప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారట. డిప్యూటీ అయినప్పటికీ తనను కిరణ్ ఏ అంశాల్లోనూ సంప్రదించడం లేదని ఆజాద్ ఎదుట చెప్పారని తెలుస్తోంది.

సోమవారం దామోదర కిరణ్ తీరుపై మండిపడ్డారట. శంకర రావు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ తదితర దళిత నేతల వెనుక దామోదర ఉన్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన దామోదర సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతూ సమయం వచ్చినప్పుడల్లా సిఎం దళిత వ్యతిరేకి అంటూ మండిపడుతున్నారట. తద్వారా దళిత నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రెడ్డి - కమ్మ వర్గాలకు చెక్ చెప్పి దళిత కార్డు ద్వారా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం సభలు, సమావేశాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారట.

ఇప్పటికే బొత్స సత్యనారాయణతో పీకలోతుల విభేదాల్లో కూరుకుపోయిన కిరణ్‌కు దామోదర కొత్త తలనొప్పి తయారయ్యారనే చెప్పవచ్చు. గీతా రెడ్డిని కాదని దామోదరకు డిప్యూటీ కట్టబెట్టడం, ఆ తర్వాత ఆయనే కొరకురాని కొయ్యగా మారటం కిరణ్ వర్గానికి రుచించడం లేదట. ఆయనను డిప్యూటీ చేసి పొరపాటు చేశామని కిరణ్ వర్గం భావిస్తోందట.

English summary
It seems, Deputy CM Damodara Rajanarsimha lashes out at CM Kiran Kumar Reddy for Dalith issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X