ఎవరినైనా పక్కన పెడ్తాం: జూ. ఎన్టీఆర్‌పై చంద్రబాబు

2014లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ఆయన అన్నారు. పార్టీకి సేవ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా తాము ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. బాలకృష్ణ సహా అందరూ పార్టీ నిర్ణయాలకు, నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొల్లేరు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు తాము అధికారంలోకి వస్తే చేపల చెరువులకు సంబంధించి 7500 ఎకరాలను పేదలకు పంచుతామని ఆయన చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు సరిగా లేకున్నా రెండో పంటకు నీరు విడుదల చేశామని ఆయన చెప్పారు.
అంతకు ముందు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. హీరో బాలకృష్ణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోరని ఈ సందర్భంగా చెప్పారు. బాలయ్య ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications