బాలయ్యపై కాపునాడు ఫైర్, క్షమాపణకు డిమాండ్

ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే వారంతా బయటకు వస్తారని ఆయన అన్నారు. కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 27, 28,29 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వినతిపత్రాలు సమర్పిస్తామని వారు చెప్పారు. కాపులను బిసీల్లో చేరుస్తామని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోకపోతే కాపులు కాంగ్రెసుకు దూరమవుతారని వారన్నారు.












Click it and Unblock the Notifications