ఎంపీని, నన్నడిగే హక్కు బొత్సకు లేదు: హర్ష కుమార్

Harsha Kumar
న్యూఢిల్లీ: సమన్వయ కమిటీపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ అడిగే హక్కు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు లేదని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో అన్నారు. తాను ఏఐసిసి సభ్యుడినని, ఎంపీనని ముందు తాను లేవనెత్తిన సమస్యను పరిష్కరించాలన్నారు. అలా చేయకుండా వివరణ అడిగితే తాను ఇవ్వనని చెప్పారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంపై బొత్స స్పందించిన తీరు అంతంత మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తగిన రీతిలో స్పందించి, ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారని ప్రశంసించారు. కానీ, పార్టీ మాత్రం ఈ విషయంలో విఫలం అయ్యిందన్నారు. అంబేద్కర్ అన్ని వర్గాలకూ అవసరమంటూ ప్రకటించి బొత్స సరిపెట్టేశారన్నారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందంటూ తెలుగుదేశం ఆరోపించటం సరికాదన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆజాద్ పనితీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆజాద్ హైదరాబాద్ వెళ్లినప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలకు కేటాయించింది కేవలం 40 నిమిషాలు మాత్రమేనని, అది కూడా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ గేటు వద్ద ఉండి లోనికి పంపించిన వారితోనే మాట్లాడారని ఆరోపించారు. పార్టీకి ఎంత సమయం కేటాయించారో మిగతా అంశాలకు ఎంత సమయం కేటాయించారో ఆయన వచ్చినప్పుడల్లా కార్యకర్తలు, నాయకులు ఎలా అసంతృప్తికి గురవుతున్నారో అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళతానన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలు పార్టీ పరిస్థితి గురించి వాస్తవాలు చెబుతారని, తద్వారా పార్టీ స్థితిగతులు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.

కానీ, అలాంటి వారికి ఆజాద్ సమయం ఇవ్వటం లేదని చెప్పారు. గతంలో ఇన్‌ఛార్జిగా ఉన్న వీరప్పమొయిలీ గంటల తరబడి కార్యకర్తలతో మాట్లాడేవారన్నారు. ఆజాద్ ఇలా అహంకార ధోరణితో వ్యవహరించటం పార్టీకి మంచిది కాదన్నారు. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను ఇవ్వటం వల్లనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోందని, అది మర్చిపోవడం సరికాదని హెచ్చరించారు. సమన్వయ కమిటీలోని బొత్స, డీఎస్, చిరంజీవిలను ఒకే సామాజిక వర్గంగా పరిగణించాలని, ఇందులో బిసిలు, ఎస్సీలు, ఎస్టిలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి సమతుల్యం పాటించాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+