హామీ మేరకు కేసులు ఎత్తివేస్తున్నాం: సబిత ఇంద్రారెడ్డి

సకల జనుల సమ్మె సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులను మరోసారి పరిశీలిస్తామని చెప్పారు. కేసుల వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. వారు అన్ని రకాల పోటీ పరీక్షలు రాసుకోవచ్చునని చెప్పారు. తాజా కేసుల ఎత్తివేత ద్వారా ఐదు వేల మంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం కేసులు ఎత్తి వేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్, ప్రభుత్వం ఆస్తుల ధ్వంసం కేసులో న్యాయపరమైన ఇబ్బందులను పరిశీలిస్తున్నామని చెప్పారు. అవకాశం ఉన్న వారందరి పైనా కేసులు ఎత్తివేస్తామన్నారు. అమలాపురం ఘటనపై సాయంత్రం లోగా నివేదిక వస్తుందని, ఆ తర్వాత స్పందిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications