దమ్ముంటే ఆస్తులు చెప్పు: జగన్‌కు బొత్స సవాల్

Botsa Satyanarayana
నల్లగొండ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రైతు పోరు బాట వల్ల, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడాకు బయలుదేరుతూ ఆయన చౌటుప్పల్‌లో బుధవారంనాడు మాట్లాడారు. ఆ తర్వాత మిర్యాలగుడాలో రాగ్యానాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర పరిస్థితులను తాను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని ఆయన చెప్పారు తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెసు నిర్ణయం తీసుకుంటుందనిన ఆయన అన్నారు.

ప్రజల సానుభూతి కోసమే జగన్ మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్తులు ఎలా వచ్చాయే జగన్ వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే జగన్ తన అస్తులను బయట పెట్టాలని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన చెప్పారు. దమ్ముంటే దోపిడీ చేయలేదని ఆస్తులు ప్రకటించాలని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తులపై విచారణలు వద్దని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నీతులు తమకు అక్కర లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+