అనుమానాస్పద స్థితిలో ఎంబిఎ గ్రాడ్యుయేట్ మృతి

Himayat Sagar
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఓ ఎంబిఎ గ్రాడ్యుయేట్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని శవం హిమాయత్ సాగర్‌లో మంగళవారంనాడు తేలింది. మృతుడు పాండు రంగారెడ్డి (26) లంగర్‌హౌస్‌లోని బాపూజీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు., అనతు లంగర్‌హౌస్‌లో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు. అదే సమయంలో రాజేంద్ర నగర్‌లోని ఆరే మైసమ్మ ప్రాంతంలో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం - పాండు రంగారెడ్డి సోమవారం ఉదయం 4 గంటలకు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఆర్థరాత్రి వరకు కూడా తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారంనాడు అతని బైక్‌ హిమాయత్ సాగర్ ఆనకట్టపై పడి ఉండడం గమనించారు. సాయంత్రానికి అతని శవం హిమాయత్ సాగర్‌లో తేలుతూ కనిపించింది. శవాన్ని వెలికి తీసి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+