బాలకృష్ణపై విమర్శలకు లగడపాటికి వంశీ, నాని సవాల్

Vallabhaneni Vamshi-Kodali Nani
విజయవాడ: హీరో నందమూరి బాలకృష్ణను విమర్శించిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ, జిల్లా శాసనసభ్యుడు కొడాలి నాని బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటికి బాలకృష్ణను విమర్శించే హక్కు గాని, స్థాయి గాని లేదన్నారు. ఆయనకు దమ్ముంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. లగడపాటిది బాలకృష్ణను విమర్శించే స్థాయి కాదన్నారు. ఎప్పుడూ తన నియోజకవర్గంలో ఉండని లగపాటి నిత్యం మీడియాలో ఉండటానికే అలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నారు. కాంగ్రెసు నేత నెహ్రూ తాను తెలుగుదేశం పార్టీలోకి వస్తానని మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నారని, ఐతే ఆయన మాత్రం ఒప్పుకోలేదని వంశీ మండిపడ్డారు. అందుకే నెహ్రూ చంద్రబాబుపై ఇష్టం వచ్చిన విధంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు రైతు పోరు బాట యాత్రను విమర్శించే హక్కు లేదన్నారు. రైతు బజార్‌లు టిడిపి హయాంలనే వచ్చాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

నెహ్రూ అలాగే మాట్లాడితే కోడిగుడ్ల సీన్ రిపీట్ అవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి మంత్రి పదవి రాకపోవడంతో నెహ్రూ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఈ స్థాయికి రావడానికి కారణమైన టిడిపిపై విమర్శలు చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు. ఆయన ఇప్పటికైనా సంస్కారం నేర్చుకోవాలని లేదంటే టిడిపి కార్యకర్తలు బుద్ధి చెబుతారన్నారు. ముందు నీదే పార్టీయో ఎక్కడి నుండి పోటీ చేయాలో నిర్ణయించుకో కానీ టిడిపిని లక్ష్యంగా పెట్టుకోవడం మానేయమని సూచించారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేశానని, తన పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+