బస్సును నడిపి పిచ్చోడి వీరంగం, 9 మంది మృతి

Mentally unstable man hijacks bus
పూణే: ఓ పిచ్చోడి బస్సును రోడ్డు పైకి తీసుకు రావడంతో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన పూణేలో బుధవారం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ఓ బస్సును ఓ పిచ్చోడు రోడ్డు పైకి తీసుకు వచ్చాడు. గంట పాటు ఇష్టం వచ్చినట్లుగా నడిపాడు. దీంతో తొమ్మిది మంది మృతి చెందగా, సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. 40 వాహనాల వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్న నాలుగు హాస్పిటల్స్‌లో చేర్పించారు. అతను ఈ బస్సును నగరంలో రద్దీగా ఉండే ప్రదేశంలో నడపడంతో ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అతనిని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ సంఘటనపై పూణే పోలీసు కంట్రోల్ కార్యాలయం స్పందించింది. ఆరుగురు పాదాచారులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా తమకు సమాచారం అందిందని పేర్కొంది. మరో పదిహేడు మంది గాయపడ్డారని, మరో ఇరవై నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. బస్సును నడిపిన డ్రైవర్‌ను నిలయం టాకీస్ ఏరియాలో అరెస్టు చేసినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+