సునీల్ రెడ్డి అరెస్టు తర్వాత జగన్‌లో భయం: పెద్దిరెడ్డి

Telugudesam
హైదరాబాద్: సునీర్ రెడ్డి అరెస్టు తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలో భయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి బుధవారం అన్నారు. నన్ను చంపండి, కాల్చండి అనే మాటలు జగన్ నోటి నుండి మొదటిసారి వస్తున్నాయని, అవి భయానికి సంకేతమన్నారు. తాను ఇరుక్కుపోతున్నానని అర్థమైన జగన్ దాంతో సానుభూతి కోసం ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయ్యాయని అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా టిడిపి ఆయన అవినీతిపై పోరాడిందన్నారు. ఎమ్మార్‌పై టిడిపి హయాంలో కుదుర్చుకొన్న ఒప్పందంలో లొసుగులు ఉన్నాయన్న జగన్ వర్గం నేతల వాదనను ఆయన తోసిపుచ్చారు. సొలిసిటర్ జనరల్ గతంలోనే ఈ వాదనలను పరిశీలించారన్నారు.

బయటి వ్యక్తులతో ఒప్పందానికి అవకాశం ఉన్నా అటువంటి ఒప్పందాలు కుదుర్చుకొనే ముందు అంతకు ముందు ఒప్పందంలో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూసుకోవడం, రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరని అదే ఒప్పందంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. దీని ప్రకారం ఎపిఐఐసి వాటాను తగ్గిస్తూ ఎమ్మార్ తీసుకొన్న నిర్ణయం చట్టబద్ధం కాదని తేల్చిచెప్పారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి జగన్ వర్గం నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+