గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడు జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ/ఖమ్మం/గుంటూరు: రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. గుంటూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, మధిర, వైరా, అచ్చంపేట, బోనకల్లు, అమరావతి, క్రోసూరు, వీరులపాడు, ఎర్రుపాలెం తదితర మండలాల్లో భూమి స్వల్పంగా కంపించింది. గం.12.26 నిమిషాల నుండి గం.12.30 నిమిషాల మధ్య వివిధ ప్రాంతాల్లో ఐదుసార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు ఆందోళన చెందారు. అందరూ రోడ్ల మీదకు వచ్చి నిలబడ్డారు. ఓ చోట అపార్టుమెంట్ పక్కకు ఒరికింది.

చిన్న చిన్న సంఘటనలు మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదు. కృష్ణా తీర ప్రాంతంలో కూడా ప్రకంపనలు గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై ఎలాంటి రీడింగ్ నమోదు కాలేదు. భూప్రకంపనలు 2.8 మాగ్నట్యూడ్ కన్నా తక్కువగా ఉంటే రిక్టర్ స్కేల్‌పై నమోదు కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న చిన్న ప్రకంపనలే అని ఎలాంటి భయం అవసరం లేదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గలేదు.

English summary
Ground Vibrations took place in Krishna, Guntur and Khammam districts today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X