చంద్రబాబు నిర్ణయం: జగన్ సాక్షి డైలీ బహిష్కరణ

Sakshi Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికను, టీవీ చానెల్‌ను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా వెలువడుతుందని నమస్తే తెలంగాణ పత్రికపై, టీ చానెల్‌పై కూడా ఆ పార్టీ అదే నిర్ణయం తీసుకుంది.పార్టీ అధినేత చంద్రబాబుతో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు తదితరులు గురువారం రాత్రి సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆ రెండు చానెళ్లు, పత్రికల్లో తమ పార్టీపై, పార్టీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కథనాలను వండివారుస్తున్నారని పలువురు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ చానెళ్లు, పత్రికల తీరుపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వాటి తీరులో ఎటువంటి మార్పు లేదన్న అభిప్రాయంతో చంద్రబాబు ఏకీభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఆ పత్రికలు, చానెళ్లను బహిష్కరించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో బహిష్కరణ నిర్ణయాన్ని టీడీపీ అధికారికంగా ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+