హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని రాష్ట్ర పర్యటన రద్దు, ముఖ్యమంత్రికి నిరాశ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
హైదరాబాద్: ఒకే రోజు లక్షమందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించాలనే ఉద్దేశంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజీవ్ యువ కిరణాల కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ హాజరు కావడంలేదు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అదే రోజు ఢిల్లీకి విదేశీ అతిథులు వస్తున్నందున ప్రధాని రాలేకపోతున్నారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 4వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో అట్టహాసంగా లక్ష మంది యువతకు ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలను కల్పిస్తూ నియామక పత్రాలను అందించాలని ముఖ్యమంత్రి భావించారు. వాస్తవానికి గత నెలలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావించారు. కానీ, ప్రధానికి వీలు కాకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఫిబ్రవరి 4న ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ప్రధాని హామీ ఇచ్చారు.

తానే స్వయంగా గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శించి, వేదిక నుంచి ఇతర ఏర్పాట్లు ఎలా ఉండాలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు సహచర మంత్రులను కూడా వెంట తీసుకుని వెళ్లారు. ఏర్పాట్లన్ని చకచకా జరిగిపోతున్న సమయంలో శనివారం 4వ తేదీన ప్రధాని రావడం లేదని సమాచారం వచ్చింది. దీంతో ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం కొనసాగుతుందా లేదా అనేది సందేహంలో పడింది.

English summary
PM Manmohan Singh's Hyderabad visit on February 4 is cancelled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X