బయటి వ్యక్తుల పని: యానాం రీజెన్సీ ఘటనపై బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: యానాం రీజెన్సీ సిరామిక్స్ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుమానాలు వ్యక్తం చేశారు. దాడిలో మరణించిన రీజెన్సీ సిరామిక్స్ వైస్ చైర్మన్ చంద్రశేఖర మృతదేహానికి ఆయన శనివారం నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏం జరిగిందనే విషయాన్ని రీజెన్సీ సిరామిక్స్ చైర్మన్ నాయుడిని అడిగి తెలుసుకున్నారు. వాస్తవాలు బయటకు రావడానికి ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

రాజకీయ కక్షతోనే బయటి వ్యక్తులు దారుణానికి పాల్పడి ఉంటారని, అసలు జరిగిందేమిటో బయటకు రావడం అవసరమని ఆయన అన్నారు. సంఘటనకు స్థానిక పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక పార్లమెంటు సభ్యుడిగా హర్ఖకుమార్‌కు ఉందని ఆయన అన్నారు. నిజంగా జీతాల కోసమే ఆ సంఘటన జరిగిందా, రాజకీయ కారణాలు ఈ సంఘటనకు పురికొల్పాయా అనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఉద్యోగాలు కల్పించిన చంద్రశేఖర్ ఇవాళ్ల మరణించారని, ఇది పద్ధతి కాదని ఆయన అన్నారు. చంద్రేశేఖర్ మృతదేహానికి ఆదివారం హైదరాబాదులో అంత్యక్రియలు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+