హర్ష కుమార్‌కి ముంబై మాఫియా కల వచ్చిందా?: వర్ల

Varla Ramaiah
హైదరాబాద్: యానాంలో రీజెన్సీ కంపెనీ సంస్థ వైస్ చైర్మన్‌ను ముంబయి మాఫియా హత్య చేసిందన్న అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య తప్పు పట్టారు. చంద్రశేఖర్‌ను ముంబయి మాఫియా చంపినట్లు ఆయన ఏమైనా కలగన్నారా అని ప్రశ్నించారు. రీజెన్సీ సంస్థకు చెందిన చంద్రశేఖర్ హత్య మాఫియా పని అని హర్షకుమార్ ఎలా తెలుసుకున్నారో చెప్పాలన్నారు. ఇంత కీలక సమాచారం ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు అందజేయాల్సిన బాధ్యత ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు ఉందన్నారు. ఆయన ఆ పని చేశారా? చేయకపోతే ఎందుకు చేయలేదన్నారు. మాఫియా ప్రమేయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా అంతకుముందు హర్ష కుమార్, రీజెన్సీ సిరామిక్స్ వ్యవహారంలో కార్మిక నేత మురళీమోహన్ మృతి, ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ హత్యోదంతంతోపాటు మొత్తం వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తన ప్రమేయం ఉన్నట్టు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అనడం సరికాదన్నారు. యాజమాన్యం వైపు మాట్లాడుతున్న చంద్రబాబు కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని ఆక్షేపించారు. ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌పై కొన్ని అరాచక శక్తులు దాడిచేసి హతమార్చి ఉంటాయని పాండిచ్చేరి అధికారులు తనతో చెప్పినట్టు హర్షకుమార్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+