పదవి కాపాడుకునేందుకే కిరణ్ రెడ్డి ఆరాటం: కిషన్ రెడ్డి

Kishan Reddy
కరీంనగర్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి కాపాడుకోవడం కోసమే ఆరాటపడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ శాసనసభ్యుడు కిషన్ రెడ్డి మంగళవారం అన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ పోరు యాత్ర చేస్తున్నారు. పోరు యాత్ర పదమూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సిఎం కిరణ్‌కు ప్రజా సమస్యలు పట్టడం లేదని పదవి కాపాడుకునేందుకే ఆరాటపడుతున్నారన్నారు. వ్యాట్ గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించక పోవడం పాలకుల పనితీరును తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని కేంద్రం కూడా పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో తొమ్మిది వందల మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టక పోవడం శోచనీయమన్నారు.

కేంద్రం నుండి కరవు భత్యం తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లు పెడితే ప్రతిపక్షంలో ఉన్న బిజెపి మద్దతిస్తుందని చెప్పారు. తెలంగాణ బిల్లు పెట్టి రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని తొలగించాలని సూచించారు. రాష్ట్రంలో పలుచోట్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+