చిరుపై ఆరోపణలు చేస్తే అంతే: దేవినేని ఉమపై ఎమ్మెల్యేలు

దేవినేని ఉమమహేశ్వర రావు ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపణల్లో నిజం ఉందని తేలితే తాము రాజీనామా చేస్తామని, నిజం లేదని తేలితే ఉమా మహేశ్వర రావు రాజీనామా చేస్తారా అని వారు సవాల్ చేశారు. భవానీ ద్వీపం ఒప్పందాన్ని రద్దు చేస్తే తనకు వస్తుందని దేవినేని ఉమ అనుకుంటున్నారని వారన్నారు. దేవినేని ఓ బ్లాక్ మెయిలర్ అని, దేవినేని ఉమ బ్లాక్ మెయిల్ వల్లనే కృష్ణా జిల్లాకు పరిశ్రమలు రావడం లేదని వారు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసంలో చిరంజీవి పాత్ర ఉందనే ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ ఆరోపణలను వారు ఖండించారు.












Click it and Unblock the Notifications