జైలులో కళ్లు తిరిగి పడిపోయిన బిపి ఆచార్య

జైలుకు వచ్చిన తర్వాత ఆచార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అరెస్టు చేసిన తర్వాత బిపి ఆచార్యను కోర్టు రెండు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఆ సమయంలో సిబిఐ అధికారులు ఆయనకు బేగంపేటలోని ఆస్పత్రిలో చికిత్స అందించి దిల్‌కుషా అతిథిగృహానికి తరలించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయనకు గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయనను సిబిఐ అధికారులు నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో చికిత్స, వైద్య పరీక్షల అనంతరం గురువారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. బిపి ఆచార్య ఆరోగ్యం బాగాలేదని, వైద్యులు పరీక్షిస్తున్నారని జైలు ఉన్నతాధికారి కేశవ నాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications