వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు కలవడంవల్లే బయటకు వచ్చాం!: రాజశేఖర్ జీవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jeevtha-Rajashekar
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలో తన పార్టీ ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి పార్టీలోకి రావడం వల్లనే తాము కాంగ్రెసు పార్టీకి దూరమయ్యామని ప్రముఖ హీరో రాజశేఖర్ దంపతులు గురువారం పరోక్షంగా చెప్పారు. హీరో రాజశేఖర్, దర్శకురాలు జీవిత మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా కాంగ్రెసు పార్టీ తమను బాగా ఉపయోగించుకుందని వారు ఆరోపించారు. గత 2009 సాధారణ ఎన్నికల్లో ప్రచారం కోసం ఎన్నో ఊళ్లు తిప్పిందన్నారు. పలు నియోజకవర్గాల్లో తాము భారీగా ప్రచారం చేశామని చెప్పారు. అయితే ఎవరైతే కాంగ్రెసు పార్టీని తిట్టారో వాళ్లని కలుపుకున్న కారణంగానే తాము ఆ పార్టీ నుండి బయటకొచ్చామని పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి అన్నారు.

రాష్ట్రంలో డెబ్బై లక్షల ఓట్లున్న పార్టీని కలుపుకోవడం సహజమేనని వారు అన్నారు. ఆ విషయాన్ని తాము తప్పు పట్టడం లేదన్నారు. అయితే కాంగ్రెసుకు అంతగా ప్రచారం చేసిన తమను పిలిచి విలీనం తదితర విషయాలు రాజకీయాల్లో సహజమేనని చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా వారు కాంగ్రెసుకు దూరమై ఆ తర్వాత కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయనతో విభేదించి ఆ పార్టీ నుండి కూడా బయటకు వచ్చారు.

English summary

 Hero Rajasekhar and director Jeevitha blamed Tirupati MLA Chiranjeevi for leaving Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X