వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకిస్తే కాపుల్లో విశ్వాసం పెంపు: బాబుతో ఉమ్మారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ummareddi Venkateswarlu
హైదరాబాద్: తనకు ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా కాపు కులస్థుల్లో పార్టీ పట్ల విశ్వాసం కలిగించాలని తెలుగుదేశం సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఉమ్మారెడ్డి చంద్రబాబును కలవడం ఇదే మొదటిసారి. తన కుమారులు వెంకటరమణ, వీర గణేష్, వీరేంద్రకుమార్, అల్లుడు కిలారు రోశయ్యలతో కలిసి ఆయన చంద్రబాబు ఇంటికి వెళ్లారు.

కాపులకు టీడీపీ పుట్టిల్లని, వారంతా తిరిగి పార్టీలోకి రావాలని ఇటీవల చంద్రబాబు నర్సాపురం వెళ్ళినప్పుడు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి తగిన అవకాశాలిస్తే.. వారిలో పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతుందనిస ప్రస్తుతం పార్లమెంటులో ఈ వర్గం నుంచి ఎంపీలు ఎవరూ లేరని, ఎమ్మెల్యేలు కూడా ఇద్దరే ఉన్నారని ఆయన చెప్పారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తే అది ఒక మంచి సంకేతం అవుతుందని ఉమ్మారెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బాపట్ల ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా నెగ్గినవారిలో తాను ఒక్కడినే ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్నానని, అయినా పార్టీలో తనకు నిరాదరణ ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ పట్ల అంకిత భావం ఉన్న ఉమ్మారె డ్డి అంటే తనకు అత్యంత గౌరవమని, కేంద్రంలో అవకాశం వచ్చినప్పుడు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం కల్పించానని చంద్రబాబు చెప్పారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అనేక సమీకరణాలపై పరిశీలన జరపాల్సి ఉంటుందని, అందులో ఉమ్మారెడ్డి పేరు కూడా పరిశీలనకు తీసుకొంటానని ఆయన హామీ ఇచ్చారు.

English summary
Telugudesam leader Ummareddi Venkateswarlu urged party president N Chandrababu to give RS seat to him to enhance the confidence of Kapus towards the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X