ఫలించని సిఎం బుజ్జగింపులు, తిరుగుబాటుకే సత్యవతి

Sathyawati
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస శాసనసభ్యురాలు బొడ్డేపల్లి సత్యవతిని బుజ్జగించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించేలేదని తెలుస్తోంది. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కకపోవడంతో పాటు తమ జిల్లాకు చెందిన కొండ్రు మురళికి దక్కడంపై ఆమె తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రివర్గంలో స్థానం లభించలేదని తెలిసిన సత్యవతి తన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. రాజీనామా చేసేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆమె అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించిన ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. తగిన గుర్తింపు లభిస్తుందని, కాస్తా సహనం వహించాలని ఆయన ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. తాను సీనియర్ శాసనసభ్యురాలినని, అయినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. కొండా సురేఖ రాజీనామా తర్వాత బిసి మహిళతో ఆ స్థానాన్ని భర్తీ చేయకపోవడం వల్ల బిసి మహిళలకు అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని ఆమె అన్నారు. మంత్రి వర్గ విస్తరణ శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విభేదాలకు దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+