డిఎల్ చెప్పినవన్నీ నిజాలే, అన్ని పార్టీల పేర్లు: బొత్స

మోపిదేవిపై ఆరోపణలను పలువురు మంత్రులు కూడా ఖండించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యం మాఫియాపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. మంత్రులు, ఐఏఎస్‌లు చట్టానికి అతీతులు కాదన్నారు. ఆనంను లెక్చరర్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే సంవత్సరానికి రూ.3500 కోట్ల ఉపకార వేతనాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఉపకార వేతనాలలో రూ.15 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని వ్యక్తి చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి రఘువీరా రెడ్డి వేరుగా మద్యం వ్యాపారి రమణను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోపిదేవిపై ఆరోపణలు నిజం కాదని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాలన్నారు.












Click it and Unblock the Notifications